స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకాధారణ పొందుతూ రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే ఈ సీరియల్ గత కొన్నిరోజులుగా రోజుకొక ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది. స్క్రీన్ మీద రిషి, వసుధారల లవ్ స్టోరీకి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో రిషి మ్యానరిజంకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు. రిషి, వసుధారల లవ్ స్టోరీని ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతారు. కాగా ఈ సీరియల్ ఇప్పుడు ఒక ఎమోషనల్ గా మారిపోయింది. తాజాఅ గుప్పెడంత మనసు సీరియల్ టైమింగ్ స్లాట్ చేంజ్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. స్లాట్ టైమింగ్ చేంజ్ చెయ్యొద్దంటూ పెద్ద ఎత్తున మా టీవీ యాజమాన్యంకి రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్, బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఈ రెండు సీరియల్స్ ప్రోమోలకి కామెంట్ సెక్షన్ లో మా సీరియల్ బాగుందంటూ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ రైటర్ చేంజ్ అయ్యాడు. అలాగే ఈ సీరియల్ టైమింగ్ స్లాట్ కూడా చేంజ్ అయింది. అయినా రేటింగ్ మాత్రం తగ్గలేదు. ఇదంతా శైలేంద్ర ఎంట్రీ వల్లే జరిగిందంటూ అతడిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సీరియల్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కథని కొన్ని రోజులు ముందుకు తీసుకెళ్లారు మేకర్స్. ఆ తర్వాత రిషి అందరికి దూరంగా వెళ్ళిపోయాడు. శైలేంద్ర మనుషులు రిషిని కత్తితో పొడవడంతో రిషి హాస్పిటల్ లో ఉన్నాడు. మరొకవైపు వసుధార తల్లి చనిపోయింది. వసుధార చక్రపాణి దగ్గర ఉంటూ స్టడీస్ పై దృష్టి పెట్టింది. ఇలా సీరియల్ లో ట్విస్ట్ ఇస్తూ కథని మరొక మలుపు తిప్పారు డైరెక్టర్. కాగా తాజాగా వచ్చిన ప్రోమోలో రిషి జైలు నుండి బయటకు వస్తున్నట్లు చూపించారు. దీంతో రిషి ఫ్యాన్స్ రిషి సర్ జైలుకి వెళ్లడమేంటి ఇది కరెక్ట్ కాదని ఒకరు.. కేజీఎఫ్ లో యష్ లా ఉన్నాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ ఈ సీరియల్ ని ఆసక్తికరంగా చూస్తున్నారని వారి ఎమోషనల్ కామెంట్లని చూస్తుంటే తెలుస్తుంది.